Type Here to Get Search Results !

Sports Ad

గంటకు వెయ్యి రూపాయల జీతం RBIలో ఉద్యోగాలు Rs 1000 Per Hour Jobs In RBI

గంటకు వెయ్యి రూపాయల జీతం RBIలో ఉద్యోగాలు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ బ్యాంకర్, వాణిజ్య బ్యాంకుల మాతృ సంస్థ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’లో ఉద్యోగాలు పడ్డాయి. ఆర్బీఐ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ (MC) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఈ నెల(ఫిబ్రవరి) 14. ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. 

ఖాళీల వివరాలు...
మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. జనరల్ విభాగంలో రెండు ఎస్‌సీ, ఎస్‌టీ విభాగాల్లో ఒకటి చొప్పున ఖాళీలున్నాయి. ఆర్బీఐలో పని చేయాలనుకునే వైద్య నిపుణులకు ఇదొక చక్కని అవకాశం.

 పోస్టుల సంఖ్య నాలుగే, కాంపిటీషన్ ఎక్కువుంటది అని నిరుత్సాహ పడకండి. ఆ అదృష్టం మిమ్మల్నే వరించొచ్చు. ఆర్బీఐలో పనిచేశారన్న పేరు, అనుభవం మీకు తోడైందంటే ఇతర అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.  

అర్హత ప్రమాణాలు...
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)చే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ.

 జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
మెడికల్ ప్రాక్టీషనర్‌గా కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ, జీతం వివరాలు ఎటువంటి వ్రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1,000 వేతనం లభిస్తుంది. 

దరఖాస్తు చేయు విధానం...
అభ్యర్థులు మొదట ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారమ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని పూరించి 2025, ఫిబ్రవరి 14 సాయంత్రం 4:30 గంటల్లోపు కింద ఇచ్చిన చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా...
Regional Director,
Human Resource Management Department,
Recruitment Section,
Reserve Bank of India,
Kolkata Regional Office,
15, Netaji Subhas Road,
Kolkata - 700001.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies