మా ఆటగాడికి బుద్ది లేదు పాక్ స్పిన్నర్‌పై వసీం అక్రమ్ విమర్శలు
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆటపైనే కాదు ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. రెండు మ్యాచ్ ల్లోనూ పోరాడకుండానే ప్రత్యర్థి ధాటికి చేతులెత్తేసింది. దీంతో సొంత దేశంలోని అభిమానులే ఆ జట్టుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లందరూ సమిష్టిగా విఫలమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిరాశపరిచారు. ప్రదర్శన సంగతి పక్కనపెడితే ఆటగాళ్ల ప్రవర్తన కూడా హద్దులు దాటింది. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చేసిన పని ఎవరికీ నచ్చలేదు.