Type Here to Get Search Results !

Sports Ad

రేపే ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే When And Where To Watch Tomorrow's England V/S India ODI Series Live Streaming

రేపే ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే

Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాయి. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 6) తొలి వన్డే జరగనుంది. నాగ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతుండడం సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు బరిలోకి దిగుతుండడంతో ఈ సిరీస్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత భారత్ ఆడుతన్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. 

 టీ20లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉంటే భారత్ గడ్డపై సిరీస్ గెలిచి రోహిత్ సేనకు షాక్ ఇవ్వాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే...
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

సిరీస్ షెడ్యూల్... 
మొదటి వన్డే:  ఫిబ్రవరి 6 (VCA స్టేడియం, నాగ్‌పూర్),మధ్యాహ్నం 1:30 గంటలకు
రెండో వన్డే:  ఫిబ్రవరి 9 ఆదివారం (బారాబతి స్టేడియం, కటక్),మధ్యాహ్నం 1:30 గంటలకు
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్),మధ్యాహ్నం 1:30 గంటలకు 
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ , యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ , మహమ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జామీ స్మిత్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies