మార్చి 29 సూర్యగ్రహణం ఆ సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే
Health News భారత్ ప్రతినిధి : హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో బెడ్ దిగరు కాలు కదపరు ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2.21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున గ్రహణం అయిన తరువాత దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు.