నేడు కుప్పకూలిన బంగారం ధర హైదరాబాదులో రూ.3300 తగ్గిన రేటు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గడచిన కొన్ని వారాలుగా బంగారం ధరలు భారతదేశంలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే ట్రంప్ దూకుడు నిర్ణయాలతో పాటు దిగజారిన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య మెుదలైన పోరు నుంచి పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పసిడి ధరలు అమెరికా స్పాట్ మార్కెట్లలో ఔన్సుకు దాదాపు 3000 డాలర్ల గరిష్ఠాన్ని దాటేసి ప్రపంచవ్యాప్తంగా పసిడి ప్రియులకు నిద్రలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కొనుగోలుదారుల మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తగ్గిన రేట్లతో షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి ముందు వారు ఖచ్చితంగా నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలించాల్సి ఉంటుంది.