అన్ స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు రూ.83 లక్షలు పోగొట్టుకున్నాడు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బెట్టింగ్ యాప్స్ ఉదంతం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది యూట్యూబర్స్ తో మొదలైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల పరంపర టాలీవుడ్ స్టార్స్ వరకు చేరింది. టాలీవుడ్ స్టార్లు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ సహా 25 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ ఓటీటీ యాప్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ షోలో ఫన్ 88 బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం సంచలనంగా మారింది. అన్ స్టాపబుల్ షో చూసి ఫన్ 88 యాప్ డౌన్లోడ్ చేసుకొని 83 లక్షలు నష్టపోయానని ఆరోపిస్తున్నారు ఓ వ్యక్తి.