స్విగ్గీలో ఫాస్టింగ్ మోడ్ ఉపవాసం ఉండేవారికి స్పెషల్ ఫీచర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి తెలియనివారు ఉండరు. వంటింట్లో వండడం మానేసి.. యాప్ లో ఆర్డర్ చేయటానికి అలవాటు పడ్డారు సిటీ జనం. ఆకలిగా లేకపోయినా ఫుడ్ డెలివరీ యాప్ నోటిఫికేషన్ చూసి టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి ఆర్డర్ చేసే రేంజ్ అడిక్ట్ అయ్యారు జనం.
ఫుడ్ డెలివరీ యాప్ నోటిఫికేషన్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు.నోటిఫికేషన్స్ తో విసిగిపోయిన చాలామంది యాప్ ని అన్ ఇన్స్టాల్ కూడా చేసేస్తుంటారు. ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ. రంజాన్ లాంటి పండగల సమయాల్లో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ.