బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులకు భయపడి దుబాయ్‌కి పారిపోయిన హర్షసాయి, ఇమ్రాన్‌ఖాన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బెట్టింగ్ యాప్స్ ఉదంతం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది యూట్యూబర్స్ తో మొదలైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల పరంపర టాలీవుడ్ స్టార్స్ వరకు చేరింది. టాలీవుడ్ స్టార్లు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ సహా 25 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం ( మార్చి 20 ) యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరయ్యారు. ఇదిలా ఉండగా యూట్యూబర్లు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పరారీలోనే ఉన్నారు.