ఎండలు మండుతున్నాయ్ అవసరం అయితేనే బయటకు రండి వాతావరణ శాఖ వార్నింగ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బాబోయ్ ఎండలు ఠారెత్తిత్తుస్తున్నాయి. సూర్యుడు సుర్రు మంటూ మండుతున్నాడు. మార్చి నెలలో నే ఎండలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అవవసమైతేనే తప్ప జనాలను బయటకు రావద్దని వాతవరణశాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
భానుడి తాపానికి జనాలు చిటచిటలాడుతున్నారు.
ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. ఏజన్సీ ఏరియాల్లో.. కోస్తా జిల్లాల్లో గతేడాదితో (2024) పోలిస్తే ఈ ఏడాది మరింతగా ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.