వరుసగా 3 రోజుల బ్యాంక్స్ క్లోజ్ ఎందుకంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రజలు నేటి కాలంలో చాలా పనులు రోజువారీ పూర్తి చేయటానికి బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపులు కొత్త పుంతలు తొక్కిన వేళ ఆర్థిక లావాదేవీల్లో బ్యాంకుల పాత్ర పెరిగింది. అయితే ప్రస్తుతం బ్యాంకులకు వరుస సెలవులు రావటంతో ప్రజలు తమ ముఖ్యమైన పనులను పూర్తి చేయటం కోసం అసలు బ్యాంకులు ఏఏ రోజుల్లో తెరచి ఉంటాయనే ముఖ్యమైన వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 12 రెండవ శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కారణంగా బ్యాంకులు సెలవులో ఉండనున్నాయని బ్యాంకుల సెలవుల క్యాలెండర్ ప్రకారం వెల్లడైంది.