Type Here to Get Search Results !

Sports Ad

ఈ మూడు రోజులు జాగ్రత్త ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Be Careful For These Three Days, Along With The Sun, Rains Will Also Be Oppressive. Orange Alert For These Districts

ఈ మూడు రోజులు జాగ్రత్త ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇవాళ్టి (ఏప్రిల్ 16) నుంచి రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవైపు తీవ్రమైన ఎండలతో పాటు ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. మిగితా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంళాఖాతంలో ద్రోణి , ఉపరితల చక్రవాత ఆవర్తనం తో రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అధిక ఎండలతో గాలి లో తేమ శాతం పెరిగి, అక్కడక్కడ క్యూమి లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. 

 ఇవాళ్టి నుంచి మూడు రోజులు (ఏప్రిల్ 16 నుంచి 18 వరకు)  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.  తెలంగాణలోని  మూడు రోజుల పాటు కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies