జిబ్లీ ట్రెండ్ అంత మంచిది కాదు బ్రో జాగ్రత్త పర్సనల్ ఫొటోలను అదే పనిగా అప్ లోడ్ చేస్తే
Technology News సాంకేతిక వార్తలు భారత్ ప్రతినిధి : చాలామంది రకరకాల ఏఐ టూల్స్ద్వారా జిబ్లీ స్టైల్ యానిమేషన్ ఫొటోలను జనరేట్ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా వ్యక్తిగత, కుటుంబ ఫొటోలే ఉంటున్నాయి. అయితే.. ఈ వైరల్ ట్రెండ్ ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. ఇంటర్నెట్ ఎక్స్పర్ట్స్ ఏఐతో ఫొటోలు షేర్ చేసుకోవడం అంత సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు. డేటా ప్రైవసీ, సెక్యురిటీ మీద పనిచేసే ప్రోటాన్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది. వ్యక్తిగత ఫొటోలను ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లో అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
చాలా ఏఐ మోడల్స్ ఆ ఫొటోలను రకరకాలుగా వాడుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ పోలికతో ఉన్న ఫోటోలకు బదులుగా మీ అనుమతి లేకుండా మీ ఫోటోలు ఉపయోగిస్తాయి. అలాంటప్పుడు అవి మిస్యూజ్ అవ్వొచ్చు. వాటితో పరువు తీసే విధంగా ఉండే కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫొటోలను డీప్ ఫేక్ లాంటి వాటిలో వాడినా ప్రమాదమే. పైగా ఏఐ టూల్స్‌తో ఫొటోలు, ఆలోచనలను పంచుకోవడం వల్ల మెటాడేటా, లొకేషన్, సెన్సిటివ్ డేటా బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.