రాబోయే రోజులు నిప్పుల ఎండలు తెలంగాణకు వాతావరణ శాఖ వార్నింగ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. అంటే 2025, ఏప్రిల్ 16 నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వేడి గాలులు, వడగాల్పులు ఉంటాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు అవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హీట్ వేవ్ అలర్ట్ ప్రకటించింది విపత్తు నిర్వహణ శాఖ. బయటకు వచ్చే జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఎండల తీవ్రత దృష్ట్యా జనం వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను 4 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. గతంలో ఇది 50 వేల రూపాయలుగానే ఉందని దీన్ని 4 లక్షలకు పెంచినట్లు వివరించింది సంబంధిత శాఖ.