మెుబైల్ యూజర్లకు షాక్ పెరగుతున్న రీఛార్జ్ రేట్లు ఎంతంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గత ఏడాది టెలికాం కంపెనీలు తమ మెుబైల్ టారిఫ్స్ పెంచిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ వివాహ వేడుక తర్వాత రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచటంతో మిగిలిన ప్రైవేటు టెలికాం సంస్థలు సైతం తమ టారిఫ్స్ రివైజ్ చేశాయి. దీంతో అప్పట్లో చాలా మంది ఘర్ వాపసీ నినాదంతో బీఎస్ఎన్ఎల్ కి మారిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏడాది మరోసారి టెలికాం సంస్థలు తమ టారిఫ్స్ పెంచటానికి సిద్ధంగా ఉన్నాయనే వార్త యూజర్లను షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఏడాది ఛార్జీలను భారీగా పెంచేందుకు భారత టెలికాం సంస్థలు సిద్ధమౌతున్నాయని తేలింది. 2025 చివరి నాటికి ఈ పెంపు 10 నుంచి 20 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన ఆరేళ్లలో నాలుగో అతిపెద్ద రేట్ల పెంపుగా ఇది ఉండనుందని వారు చెబుతున్నారు. ప్రధానంగా పెరుగుతున్న రెగ్యులేటరీ సమస్యలతో పాటు వ్యాపారాన్ని నడిపేందుకు అవసరమౌతున్న భారీ క్యాపిటల్ అవసరాల కారణంగా ఈ నిర్ణయం నడిపించబడుతోందని తెలుస్తోంది.