తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు హైదరాబాదులో ఎంతంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ 1న కూడా అనేక మార్పులు వచ్చాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు నెల మెుదటి రోజున తమ ఎల్‌పీజీ ధరల్లో కీలక మార్పులను ప్రకటించాయి. ఆయిల్ కంపెనీలు నేడు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరటను ప్రకటించాయి. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును రూ.41 మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.
దీంతో దేశంలోని ప్రధాన మెట్లో నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే గతంలో రూ.1వెయ్యి755 వద్ద ముంబైలో ఉన్న రేటు రూ.1వెయ్యి 714కి తగ్గించబడింది. అలాగే కలకత్తాలో రూ.1వెయ్యి 913గా ఉన్న రేట్లు రూ.1వెయ్యి 872కి తగ్గాయి. ఇక చెన్నైలో గతంలో రూ.1వెయ్యి 965గా ఉన్న రేటు ప్రస్తుతం రూ.1వెయ్యి 924కి తగ్గించబడింది. ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిన తర్వాత ఒక్కోటి రూ.1వెయ్యి 988 వద్ద అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు మార్కెట్లలో కొనసాగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు గ్యాస్, సీఎన్జీ, పీఎన్జీ ధరలను ప్రతి నెల సవరిస్తుంటాయి. దీనికి ముందు ఫిబ్రవరిలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను స్వల్పంగా రూ.7 చొప్పున తగ్గించగా, మార్చిలో రూ.6 పెంపును ప్రకటించాయి. అలాగే గత ఏడాది చివరిలో అంటే డిసెంబర్ మాసంలో సిలిండర్ రేట్లను రూ.62 పెంపును ప్రకటించాయి.